
హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆర్జీవీ నుండి రేపటి రాజాసాబ్ డైరెక్టర్ మారుతి వరకు.. ఈ జోనర్ సినిమాలు తీసే దర్శకుల మేకింగ్‌కి భలే క్రేజీ ఉంది. ఒక్కప్పుడు కేవలం హార్రర్ జోనర్లో మాత్రమే సినిమా తీసే దర్శకులు.. ఇప్పుడు హర్రర్‌కి.. కాస్తా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్ మరింత ఎంగేజింగ్‌గా ఫీల్ అవుతూ.. హార్రర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. లేటెస్ట్గా అలాంటి ఓ రెండు హార్రర్ సినిమాలు థియేటర్లో రిలీజై ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి తెలుగు స్ట్రెయిట్ సినిమా కాగా.. మరొకటి తెలుగు డబ్డ్ తమిళ మూవీ. ఇపుడీ ఈ సినిమాలు ఓటీటీలో వచ్చి భయపెడుతున్నాయి. మరి ఈ మూవీస్ కథేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి? ఆ వివరాలు చూసేద్దాం.
శుభం ఓటీటీ:
సమంత నిర్మించిన శుభం మూవీ ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ మేరకు శుభం మూవీ జూన్ 13న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ వంటి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ తెలుగు హార్రర్ కామెడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చిపై సినిమా కథనం సాగింది. దీనికి హారర్ కామెడీని జోడించి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సక్సెస్ అయ్యాడు. దానికితోడు ఈ కథలో ఆడవాళ్ల పరిస్థితులపై చర్చించిన విధానం ఆలోచింపజేసింది. ముస్లిం యువతి షాలిని కొండపూడి పాత్ర ఆడాళ్ల అణచివేతకు అద్దం పట్టే పాత్రలో నటించింది. బయటకు వెళ్లాలి.. బ్యూటీపార్లర్ పెట్టాలనే కోరిక ఉన్నా.. తనలోనే అణుచుకునే పాత్ర ఆలోచింపజేస్తుంది.
మరో మహిళ కొత్తగా పెళ్లై ఓ మధ్యతరగతి ఇంట్లోకి కోడలిగా వెళ్ళినప్పుడు అక్కడ తన భర్తతో, అత్తమామలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేది ఉన్నతంగా ఉంది. మూడో మహిళ గృహిణి అయ్యాక పురుషాధిక్యత వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొంది? అనే అంశం లోతుగా చర్చించిన విధానం బాగుంది.
When the clock strikes 9, the women begin to change.
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 13, 2025
Is it a haunting… or a hilarious twist of fate? 📺
Find out in #Shubam , streaming now on Jio Hotstar ! 💫
🔗- https://t.co/qwgGMB6Ran#SubhamOnJioHotstar @Samanthaprabhu2 @TralalaPictures pic.twitter.com/2KLSF9744Q
కథేంటంటే:
వైజాగ్ లోని భీముని పట్నం అనే పల్లెటూరు. అప్పుడప్పుడే పల్లెటూళ్లకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. ఆ భీముని పట్నం ఊళ్ళో శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి) అనే యువకుడు ఉంటాడు. అతనో కేబుల్ ఆపరేటర్. తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) లతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు.
ఈ క్రమంలో శ్రీనివాస్‌కు శ్రీవల్లి (శ్రియ కొణతం)తోపెళ్లవుతుంది. ఫస్ట్ నైట్ మీద ఎన్నో ఆశలతో ఉన్న శ్రీనివాస్‌కి, మొదటిరోజే శ్రీవల్లి షాక్ ఇస్తుంది. పడక గదిలో, అది ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ, దయ్యం పట్టినట్టు వింతగా ప్రవర్తిస్తుంది. అది గమనించిన శ్రీనివాస్ షాక్ అవుతాడు.
ఆ వెంటనే అతని ఇద్దరి స్నేహితులకు కాల్ చేసిన, వాళ్ళ భార్యలు కూడా అదే టీవీ సీరియల్ చూస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. వీళ్లే కాదు ఆ ఊర్లో ఉన్న వారందరూ రాత్రి 9 గంటలు అవ్వగానే అలానే ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూడటాన్ని అడ్డుకుంటే, భర్తలపైనా తెగబడి మరీ దాడులు చేస్తారు. సీరియల్ పూర్తయ్యాక మళ్లీ ఏమీ జరగలేదన్నట్టే వ్యవహరిస్తుంటారు.
మరి వారికి సరిగ్గా ఆ సీరియల్ టైంలోనే ఎందుకు దయ్యం పడుతుంది? అలాంటి భార్యల పిచ్చి వల్ల శ్రీను, అతడి స్నేహితుల జీవితంలో ఎలాంటి మలుపు చోటుచేసుకుంది? చివరికి ఊళ్ళో ఆడవాళ్లకు పట్టిన దయ్యాన్ని ఎలా మట్టుబెట్టారు? ఈ సమస్యకి మాయ (సమంత) ఎలాంటి పరిష్కారం చూపింది. ఇంతకూ ఆ సీరియల్ ఏంటీ? ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నఆ సీరియల్‌కు శుభం కార్డ్ పడిందా? వాళ్ల కాపురాలు చక్కబడ్డాయా? లేదా అనేది మిగతా స్టోరీ.
డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీ:
తమిళ కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ (Devils Double Next Level). క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ S. ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇది ‘దిల్లుకు దుడ్డు’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది.
ఈ మూవీ 16 మే 2025న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ ఎంటర్ టైన్ అవ్వడంతో పాటు ఉత్కంఠ ఫీల్ అయ్యారు. 'దెయ్యాల ఉచ్చులు, భయానక సన్నివేశాలు, పేరడీ హాస్యం' ఇలా పలు అంశాలతో వచ్చి థ్రిల్ ఇచ్చింది. ఇపుడీ ఈ సూపర్ నేచులర్ థ్రిల్లర్ ఓటీటీలో అడుగుపెట్టింది. నిన్న (జూన్ 13న) జీ5లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
Santa's style ghost comedy ready..!👻
— ZEE5 Tamil (@ZEE5Tamil) June 13, 2025
Full-on entertainment iruku bro..!💥🤩
2025’s Biggest Horror Comedy Blast #DDNextLevel is now streaming on ZEE5..!@iamsanthanam @arya_offl @TSPoffl @NiharikaEnt @iampremanand @menongautham @selvaraghavan @geethika0001 @KasthuriShankar… pic.twitter.com/dDTkwCkStu
కథేంటంటే:
కృష్ణమూర్తి "కిస్సా" అనే వ్యక్తి యూట్యూబ్ రివ్యూవర్. తనదైన వాక్ చాతుర్యంతో సినిమాలకు రివ్యూలు ఇస్తుంటాడు. దర్శకుడు హిచ్‌కాక్ ఇరుదయరాజ్(సెల్వరాఘవన్) కు, కిస్సాకు ఏ మాత్రం పడదు. ఒకరోజు హిచ్‌కాక్ లేటెస్ట్ హర్రర్-కామెడీ మూవీ, డిడి నెక్స్ట్ లెవెల్ ప్రైవేట్ స్క్రీనింగ్‌కు అటెండ్ కావడానికి ఆహ్వానం అందుకుంటాడు కిస్సా. అంటే, కిస్సా ఒక్కడికే రహస్య స్క్రీనింగ్ ఏర్పాటు చేసానని హిచ్ కాక్ చెబుతాడు.
అయితే, ఇది మరొక పబ్లిసిటీ స్టంట్ అని కిస్సా భావించి, తన కుటుంబం మరియు స్నేహితురాలు ఆసై హర్షినితో కలిసి వెళ్లడానికి రెడీ అవుతాడు. కానీ, కిస్సాకు తెలియకుండానే తన కుటుంబం, ఇప్పటికే థియేటర్‌కి వెళ్ళిందని అతనికి సమాచారం అందుతుంది. అలా, తానొక్కడే థియేటర్ కి వెళతాడు. ప్రొజెక్టర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులుగా మారుతుంది. దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లో కన్ను తెరుస్తాడు.
ఇదే క్రమంలో మరో ఇద్దరు యూట్యూబ్ ఫిల్మ్ రివ్యూవర్స్.. వీన్ పెచ్చు బాబు మరియు వీన్ పెచ్చు మణి కూడా రహస్యంగా థియేటర్‌కి వస్తారు. వారు ఏదో విధంగా కిస్సా పాస్ గురించి తెలుసుకుంటారు. అలా వారు కూడా ప్రత్యేక స్క్రీనింగ్‌ను చూడాలనుకుంటున్నారు. లోపలికి వెళ్లేసరికి థియేటర్ హాల్ తలుపు మూసుకుపోతుంది.
ఆపై ఆ ముగ్గురూ ఒక దెయ్యం క్రూయిజ్ షిప్ లోపల చిక్కుకుంటారు. కిస్సా గర్ల్‌ఫ్రెండ్ కూడా ఓ ఆత్మగా మారిపోయుంటుంది. అక్కడ మొదలవుతుంది అసలు కథ. ఈ కథాగమనంలో హాస్యంతో నిండిన మలుపులు, రోలర్ కోస్టర్లాగా అనిపించే సన్నివేశాలతో నిండి ఉంటాయి.
అక్కడ క్రూయిజ్ షిప్లో ఓ డైరీ ఉంటుంది. అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. వారు డైరీలో విషయాలను డీకోడ్ చేయటానికి సిద్ధమవుతారు. ముగింపు మాత్రం.. పాజిటివ్ క్రెడిట్స్ వచ్చే వరకు.. బతికి ఉంటేనే వారు తప్పించుకోగలరు. అంతేకాదు.. కిస్సా అతీంద్రియ శక్తులను అధిగమించాలి. వాటి బలహీనతలు గుర్తించాలి. నిగూఢమైన పజిల్స్ సాల్వ్ చేయాలి కూడా. ఎందుకంటే..ఇది దర్శకుడు హిచ్‌కాక్ ప్రతీకారంతో కూడుకున్నది.
మరి ఇంతకు హిచ్‌కాక్ పగ ఏంటీ? ఎందుకిలా చేస్తున్నాడు? ఓ సినిమా రివ్యూవర్ లైఫ్.. ఒక రివ్యూతో ఎలా మారిపోయింది? చివరికి ఇదొక మాయా డైరీ అని ఎలా తెలుస్తోంది? డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ వెనుక ఉన్న థీమ్ ఏంటీ? అనేది మిగతా స్టోరీ!