
మలయాళ ఇండస్ట్రీ మేకర్స్ ఎంచుకునే కథల్లో వైవిధ్యత కనిపిస్తోంది. జనాల మధ్యలోనే తిరిగే కథలతో ఆధ్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలను రాసుకుంటారు దర్శక రచయితలు. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా..చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.
లేటెస్ట్గా గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు (Premalu) మూవీ కేరళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల (ఫిబ్రవరి 9న) మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. సుమారు రూ.3కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రేమలు మూవీ రూ.60 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.
నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ..లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్‌ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్‌కు తెగ ఫిదా అయ్యారు. తెలుగులో కూడా ప్రేమలు చూడాలని అందరూ ఆశించారు. ఇక ఆ తరుణం వచ్చేసింది.
లేటెస్ట్గా ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ(SS Karthikeya) సొంతం చేసుకున్నారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. మంచి ధరకే ఈ రైట్స్ దక్కించుకున్నారట కార్తికేయ. అయితే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ప్రేమలు రిలీజ్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడం కన్ఫమ్ అనిపిస్తోంది. ఇక అనుకున్న టైంకి అన్నీ కుదిరితే మహా శివరాత్రి సందర్బంగా మార్చి 8న ప్రేమలు మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేలా కార్తికేయ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ లేటెస్ట్ అప్డేట్తో ప్రేమలు లవర్స్‌కి గుడ్ న్యూస్ వచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే..ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ చూసి తెలుగు లవర్స్‌కి చాలా కాలం అయింది.
అయితే అదే రోజున హీరో గోపీచంద్ మూవీ భీమా, విశ్వక్ సేన్ గామి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.ఈ మూడు సినిమాల కథనాలు వేరే కాబట్టి..ఆడియన్స్‌లో అన్ని సినిమాలపై ఆసక్తి నెలకొంది. హీరో గోపిచంద్, విశ్వక్ సేన్‌కు చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుత సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు.