బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్‌‌డే ట్రీట్‌‌కు రెడీ

బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్‌‌డే ట్రీట్‌‌కు రెడీ

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ  చిత్రం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌‌ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. 

ఈ సందర్భంగా కొన్ని మేకింగ్ స్టిల్స్‌‌ను విడుదల చేశారు. జనవరి 3న శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌డేట్ ఇచ్చారు. శ్రీనివాస్‌‌కి ఇది పదో సినిమా. ఇదొక యాక్షన్ ఎంటర్‌‌టైనర్. కొత్త లుక్‌‌తో శ్రీనివాస్ క్యారెక్టర్‌‌ను డిజైన్ చేసినట్టు చెప్పాడు సాగర్ చంద్ర. హీరోయిన్‌‌తో పాటు ఇందులో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.  హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.