కొన్ని రోజులుగా ఢిల్లీలోనే లతా రజినీకాంత్ మకాం.. గట్టిగానే లాబీయింగ్ !

కొన్ని రోజులుగా ఢిల్లీలోనే లతా రజినీకాంత్ మకాం.. గట్టిగానే లాబీయింగ్ !

ఢిల్లీ: తమిళ సినీ నటుడు రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆమె ఢిల్లీలోనే మకాం వేశారు.

ఎంపీగా పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఆమె లాబీయింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆమెకు అవకాశం ఇవ్వకపోయినా.. తన భర్త రజినీకాంత్‌ను రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

ఈ విషయమై.. లతా రజినీకాంత్ ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు కూడా ఆమె ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

లతా రజినీ కాంత్ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆమె రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవిని ఆశిస్తున్నారు. రజినీకాంత్ సమకాలికుడైన కమల్ హాసన్ ఇప్పటికే డీఎంకే పుణ్యమా అని రాజ్యసభ ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టారు.