లావణ్య,రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రీతిపై లావణ్య సంచలమైన వాక్యాలు చేసింది. ప్రీతి డ్రగ్స్ కు బానిసైందిని.. డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా గంజాయి మార్కెట్ లో అమ్ముతుందని ఆరోపించింది. దానికి సంబంధించి వీడియోలు లావణ్య రిలీజ్ చేసింది. డ్రగ్స్ ఎంకరేజ్ చేయలేదని రాజ్ తరుణ్ పై లావణ్య కక్ష్య పెంచుకుందని శుక్రవారం రాజ్ తరుణ్ న్యాయవాది పోలీసులకు తెలిపాడు. దీంతో లావణ్య వెంటనే ప్రీతి వీడియోలు బయటపెట్టింది.
శుక్రవారం రాత్రి ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఆర్.జె.శేఖర్ బాషాతోపాటు ప్రీతి, ఉదయ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల్లో పూర్తి ఆధారాలు సమర్పిస్తామని తెలిపారు. లావణ్య ఆడ పిల్లలకు డ్రగ్ అలవాటు చేస్తోందని ఆరోపించారు. తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే నానా రకాలుగా ఇబ్బంది పెడుతోందని, న్యూడ్ వీడియోస్ పంపి టార్చర్ చేస్తుందని చెప్పారు. ప్రీతి లలా పెట్ లోని శాంతినగర్ లో నివాసముంటుందని.. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. సప్లై కూడా చేస్తుందని లావణ్య వీడియోలు బయటపెట్టింది.