మెగా కోడలు.. ఫ్యాన్స్కి వదిన అయిపోయారు.. లావణ్య క్యూట్ కామెంట్స్

మెగా కోడలు.. ఫ్యాన్స్కి వదిన అయిపోయారు.. లావణ్య క్యూట్ కామెంట్స్

మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నిన్నమొన్నటివరకు పెళ్లి విషయంలో వైరల్ ఐన లావణ్య.. ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్(Miss Perfecrt) వెబ్ సిరీస్ వల్ల మరోసారి ట్రెండ్ అవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ను పెళ్లిచేసుకున్న తరువాత ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆడియన్స్ నుండి కూడా ఈ సిరీస్ కు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఇదిలా ఉంటే.. మెగా ఫ్యాన్స్ హీరోలను మాత్రమే కాదు ఈ ఫ్యామిలీకి చెందిన ప్రతీ ఒకరిని తమ కుంటుంబ సభ్యులుగా భావిస్తారు. అందుకే వారిని అన్నా, వదిన, చెల్లి అని పిలుస్తారు. అంతే ప్రేమను కొత్తగా మెగా కుటుంబంలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠికి కూడా అందిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ సతీమణి ఉపాసనను వదిన అని సంబోధించే మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు లావణ్యకు కూడా తమ రెండో వదినలా భావిస్తున్నారు.   

ఇదే విషయాన్నీ ఇటీవల ఓ యాంకర్ లావణ్య త్రిపాఠి దగ్గర ప్రస్తావించగా.. దానికి ఆమె చాల సంతోషం వ్యక్తం చేశారు. మెగా ఫ్యాన్స్ మిమ్మల్ని వదిన అని పిలుస్తున్నారు.. దానికి మీ రియాక్షన్ ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా. దానికి లావణ్య స్పందిస్తూ.. అవునా! సో స్వీట్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక మెగా ఫ్యామిలీలో కూడా అందరు నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. 

ఆ కుటుంబం ప్రేమనే కాకుండా ఆ కుటుంబాన్ని ఇంతలా ఆదరించే ఫ్యాన్స్ కూడా నాకు అంతే ప్రేమను పంచుతున్నారు. అందుకు నాకు చాలా గర్వాంగా ఉంది.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు లావణ్య. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.