పెళ్లి కోసం అమ్మ సెంటిమెంట్.. నిహారికలాగే లావణ్య కూడా

పెళ్లి కోసం అమ్మ సెంటిమెంట్.. నిహారికలాగే లావణ్య కూడా

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)ల పెళ్లి వేడుకకు సర్వం సిద్దమయ్యింది. నవంబర్ 1న ఇటలీలో ఈ వేడుక ఘనంగా జరుగనుంది. అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ లెవల్లో రెసెప్షన్ అరేంజ్ చేయనున్నారు మెగా ఫ్యామిలీ(Mega family). అయితే పెళ్లికి మాత్రం ఇరు కుటుంబ సభ్యులతోపాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఇప్పటికే రెండు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. వాటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :- నేను స్టార్ అయ్యానంటే.. ఆ ముగ్గురే కారణం

అయితే.. లావణ్య తన పెళ్లి కోసం తల్లి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట. అదేంటంటే.. హల్దీ వేడుక కోసం లావణ్య తన తల్లి చీరని ధరించనున్నారట. తన తల్లి చీరను కేప్ లెహంగాలో కాస్త డిజైన్ చేసినట్లు సమాచారం. గతంలో మెగా డాటర్ నిహారిక కూడా తన పెళ్ళిలో తల్లి చీరను ధరించి కనిపించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను లావణ్య కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.