
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నవంబర్ లో ఆమె తాను ప్రేమించిన వ్యక్తి వరుణ్ తేజ్(Varun tej) ను పెళ్లిచేసుకున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు షాకిచ్చారు. పెళ్లి తరువాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ పై వాళ్లు దృష్టి సారిస్తున్నారు. ఓపక్క వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే మరోపక్క లావణ్య తాను ప్రధాన పాత్రలో చేస్తున్న మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు లావణ్య త్రిపాఠి. పెళ్లి తరువాత ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ కావడంతో.. ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న లావణ్య తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంచి కథ వస్తే సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనే తేడా లేకుండా ఏదైనా చేస్తాను. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్తో పాటు మరో రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. ఇక మెగా కోడలు అనే ట్యాగ్‌తో నాపై బాధ్యతలు పెరిగాయి. పెళ్లి తర్వాత చేసే సినిమాల విషయంలో వరుణ్ గానీ, మా కుటుంబం గానీ నాకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. వరుణ్ కూడా ఎలాంటి కండీషన్స్ పెట్టలేదు. నాకంటూ కొన్ని హద్దులున్నాయి. అవి నాకు తెలుసు. వాటిని దాటకుండా సినిమాలు చేస్తాను.. అంటూ చెప్పుకొచ్చారు లావణ్య. ప్రస్తతం లావణ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.