
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి తరువాత చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్‌ఫెక్ట్ (Miss Perfect). విశ్వక్ ఖండేరావు తెరకెక్కించిన ఈ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
లావణ్య రావు (లావణ్య త్రిపాఠి).. ఓక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్. ఆఫీస్ పనిపై హైదరాబాద్ వచ్చి శాంతి నిలయం అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో.. లావణ్య ఇంట్లో పనిచేసే జ్యోతి (అభిజ్ఞ) రాలేకపోతుంది. ఈ విషయాన్ని పక్క ఫ్లాట్ లో ఉండే రోహిత్ (అభిజీత్)కు చెప్పమని లావణ్యకి చెప్తుంది. ఆ విషయాన్నీ రోహిత్ కు చెప్పడానికి వెళ్లిన లావణ్య.. అక్కడంతా అపరిశుభ్రంగా ఉండటం చూసి క్లీన్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇది తెలియని జ్యోతి.. తన స్థానంలో వచ్చిన లక్ష్మి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి లక్ష్మి ఎవరు అనేది జ్యోతి తెలుసుకుందా? ఇంతకీ లక్ష్మి ఎవరు? నిజం తెలిశాక రోహిత్ స్పందనేంటి?అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
లాక్ డౌన్ పరిస్థితులపై, ఓసీడీ కాన్సెప్ట్ లపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మిస్ పర్ఫెక్ట్ కూడా అలాంటి సిరీసే. అతిశుభ్రతను ఇష్టపడే అమ్మాయి, రొటీన్ జీవితంలోనే ఆనందాన్ని వెతుక్కునే అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య ప్రేమే మిస్ పర్‌ఫెక్ట్. టైటిల్ అండ్ ట్రైలర్ ను బట్టి.. ఈ సిరీస్ లో హీరోయిన్ పర్‌ఫెక్ట్‌గా, క్లీన్ గా ఉండాలనుకుంటుందని అర్థమైపోతుంది.. అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది
ఈ సిరీస్.
ఇంట్రో సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కానీ, లావణ్య హైదరాబాద్ వచ్చాక కథలో కొత్త పాత్రలు ఎంటర్ అవుతావయి. అక్కడి నుండి కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. లాక్‌డౌన్, లావణ్య రోహిత్ పరిచయం, లక్ష్మి రోహిత్ ఇంటికెళ్లడం, శుభ్రం చేయడం.. అలా సరదాగా సాగుతుంది. మధ్యలో జ్యోతి సింగర్ కావాలనే కోరిక, లావణ్య తండ్రి హర్షవర్ధన్, ఝాన్సీ లవ్‌ట్రాక్ బోర్ కొట్టిస్తాయి. నిజానికి లక్ష్మినే లావణ్య అనే నిజం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది కానీ.. దానికి రోహిత్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఇక్కడ ట్విస్ట్. అది రివీల్ చేసిన విధానం, దానికి రోహిత్ రియాక్ట్ అయినా పద్ధతి బాగుంది. ఇక క్లైమాక్స్ కూడా ఊహకు తగ్గట్లే డిజైన్ చేశారు. మొత్తం 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ టైం పాస్ కోసం చూసేయొచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
మిస్ పర్‌ఫెక్ట్ అనే టైటిల్ కి లావణ్య న్యాయం చేశారు. లావణ్య, లక్ష్మిగా రెండు షేడ్స్‌లో ఆకట్టుకున్నారు. ఇక రోహిత్ పాత్రలో అభిజీత్ కూడా మెప్పించాడు. జ్యోతిగా చేసిన అభిజ్ఞకు కూడా ఆకట్టుకుంది. గజ్వేల్ అమ్మాయిగా ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. ఇక మిగిలిన నటులు ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోషన్ పాత్ర మేరకు మెప్పించారు. ఇక టెక్నీషియన్ల విషయానికొస్తే.. ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ అంటే ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం అని చెప్పాలి. తన మ్యూజిక్ తో సీన్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక ఆదిత్య అందించిన సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడు విశ్వక్ ఖండేరావు పనితనం ఓకే.
మొత్తంగా చెప్పాలంటే.. మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్ టైం పాస్ కోసం చూసేయొచ్చు.