
లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ లాంటి చిత్రాలను రూపొందించిన తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగ మోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కుర్చీలో దేవ్ మోహన్ కాళ్లు చేతులతో పాటు నోటికి ప్లాస్టర్ వేసి బంధించినట్టు కనిపిస్తుండగా, తన ఎదురుగా లావణ్య మైక్ పట్టుకుని అరుస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉండాలో చూపించే చిత్రమిది.
లావణ్య, దేవ్ మోహన్ పాత్రలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులంతా హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పారు. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.