
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) తన ఫ్యామిలీలో జరిగిన ఒక శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబందించిన ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో ఆ ఫోటో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠికి మేనల్లుడు పుట్టాడట. చాలా క్యూట్ గా ఉన్న బాబు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా సొట్టబుగ్గల జీన్స్ ని ఈ పిల్లాడు కొనసాగిస్తున్నాడూ.. అంటూ రాసుకొచ్చారు. అయితే పిల్లాడి ఫొటోని షేర్ చేసినప్పటికీ.. ముఖం కనిపించకుండా ఏమోజీతో కవర్ చేశారు. ప్రస్తుతం లావణ్య షేర్ చేసిన ఈ ఫోటో ఫుల్ వైరల్ అవుతోంది.
ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ త్వరలోనే రిలీజ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా వస్తున్న ఈ సిరీస్ లో అభిజ్ఞ కీ రోల్ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సిరీస్ ను విశ్వక్ కండెరావు తెరకెక్కిస్తుండగా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.