మూడు నెలల్లో సతీ లీలావతి పూర్తి చేశాం

మూడు నెలల్లో  సతీ లీలావతి పూర్తి చేశాం

లావణ్య  త్రిపాఠి కొణిదెల లీడ్‌‌గా  తాతినేని సత్య దర్శకత్వంలో  నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’.   మార్చి 6న సినిమా  రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘ఈ మూవీని  ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. దర్శక, నిర్మాతల సపోర్ట్‌‌తో   కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశా.  ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. అందరికీ నచ్చుతుంది.

దేవ్ మోహన్ నటన, సప్తగిరి కామెడీ అలరిస్తాయి’ అని చెప్పారు.  అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని  దర్శకుడు తాతినేని సత్య అన్నారు.  నిర్మాతగా తనకిది మొదటి చిత్రమని, ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నానని నాగ మోహన్ అన్నారు. వీకే నరేష్, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మిక్కీ జే  మేయర్ సంగీతం అందించాడు.