అమ్మ పేరుతో కళ్యాణ మండపం.. పైసా ఖర్చు లేకుండా పెళ్లిళ్లు.. లారెన్స్ నీది గొప్ప మనసయ్యా!

అమ్మ పేరుతో కళ్యాణ మండపం.. పైసా ఖర్చు లేకుండా పెళ్లిళ్లు.. లారెన్స్ నీది గొప్ప మనసయ్యా!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తల్లి పేరుమీద చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా అందరికీ తెలిసిందే. క్యాన్సర్, గుండె ఆపరేషన్స్ చేయించి చాలా మందికి సహాయం అందించారు. అందుకే లారెన్స్ ను ఒక సెలబ్రెటీ కన్నా మనసున్న మనిషిగానే ఎక్కువ మంది అభిమానిస్తారు. 

తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు లారెన్స్. పెళ్లిచేసుకునే తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులతో సరిగా పెళ్లిచేసుకునే సౌకర్యం లేనివారికి కళ్యాణ మండపం నిర్మిస్తున్నారట. ఇదే విషయాన్నీ స్వయంగా లారెన్స్ తెలిపారు.. నీ సినిమా విడుదలైన ప్రతిసారీ అభిమానులకు కోసం ఏదైనా చేయడం నాకు అలవాటు. అందుకే మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అందులో నా అభిమానులు ఎలాంటి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. 

ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి కారణం ఏంటంటే.. నా అభిమాని ఒకరు తన పెళ్లికి ఆహ్వానిస్తూ పత్రిక ఇచ్చారు. అప్పుడు నేను పెళ్లి ఎక్కడ అని అడగగా.. తన ఇంట్లోనే అని, కళ్యాణమండపంలో చేసుకునే అంత స్థోమత లేదని తెలిపాడు. పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధపడుతూ కనిపించడం నాకు నచ్చలేదు. అందుకే అలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే మా అమ్మ పేరుమీద కళ్యాణ మండపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అక్కడ అన్ని అసదుపాయాలు ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగా, సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చు.. అని తెలిపారు లారెన్స్‌. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు లారెన్స్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.