Pushpa 2 Leak: ఏంటీ సుకుమార్ సార్?..లీకులే సగం సినిమాని చూపించేలా ఉన్నాయి!

Pushpa 2 Leak: ఏంటీ సుకుమార్ సార్?..లీకులే సగం సినిమాని చూపించేలా ఉన్నాయి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa the Rule). ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్తో  అంచనాలు అమాంతం పెరిగాయి.

అంతేకాకుండా..ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనం ఇస్తూ..ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. దీంతో బయటకు వచ్చే లీకులే సగం సినిమాని చూపిస్తున్నాయి. లేటెస్ట్గా వచ్చిన లీకులో వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ పార్టీకి సంబందించిన పేరు..ఫోటో కావడం విశేషం.

పుష్ప సినిమాలో 'ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు' క్యారక్టర్ లో కనిపించిన రావు రమేష్..ఎర్ర చందనం సిండికేట్ బిజినెస్ కి హెడ్. పుష్ప పార్ట్1లో ఈ సిండికేట్ని పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడు పై షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ 'ప్రజా చైతన్య పార్టీ' అనే ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో బయటకి వచ్చాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ లీకులని ఎలాగైనా డైరెక్టర్ సుకుమార్  ఆపాల్సిందేనని..లేదంటే మరిన్నిపుష్ప 2 నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

డైరెక్టర్ సుకుమార్‌ రైటింగ్స్‌..మైత్రీ మూవీమేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న  రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.