టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జులై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. చిత్తూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
'లెనిన్' కు ఎన్టీఆర్ వాయిస్
ఈ పోస్టర్‌లో అఖిల్ లుక్ లేకుండా కేవలం ఓ పులి రూపం, 'లెనిన్' టైటిల్ లోగో మాత్రమే కనిపించాయి. దీంతో అభిమానులు మొదట అయోమయంలో పడినా, వెంటనే మేకర్స్ ఆ పోస్టర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టారు. ఈ సినిమాకు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కథను నడిపించే నేరేషన్ అందించారు. పోస్టర్‌లోని పులి చిహ్నం ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన గంభీరమైన స్వరాన్ని ప్రతిబింబించేలా రూపొందించారని వెల్లడించారు.
#Lenin 🐅🔥 pic.twitter.com/pe0DCjJxIQ
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2026
ఫొటోలు వైరల్..
లేటెస్ట్ గా ఎన్టీఆర్‌తో కలిసి అఖిల్, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దిగిన ఫొటోలను కూడా చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ సర్‌ప్రైజ్ అధికారికంగా ఖరారైంది. దీంతో అఖిల్, ఎన్టీఆర్ అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. థియేటర్‌లో ఎన్టీఆర్ వాయిస్‌తో సినిమా ప్రారంభమైతే ఆ అనుభూతి మరో స్థాయిలో ఉంటుందని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
A world born out of conviction.
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2026
Introduced by a voice that needs no introduction ❤️🔥❤️🔥❤️🔥
Man of Masses @tarak9999 lends his voice to introduce Sriramapuram & Bharatham Mitta at the beginning of #LENIN 💥💥💥#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna… pic.twitter.com/qP7ROGeJq6
భారీ అంచనాలతో రెడీ..
ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ పొలిటికల్ డ్రామాకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది.
