జ్యోతిష్యం: సెప్టెంబర్ .. తులారాశి వారు పట్టింది బంగారమే.. వీరికి గోల్డెన్ పిరియడ్ వచ్చేసింది..!

జ్యోతిష్యం: సెప్టెంబర్ .. తులారాశి వారు పట్టింది బంగారమే.. వీరికి గోల్డెన్ పిరియడ్ వచ్చేసింది..!

​సెప్టెంబర్ నెల చివర్లో   సెప్టెంబర్ 26న బుధుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో శుక్రుడు ఇప్పటికే నివాసం ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో తులా రాశి వారికి విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభించే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

సెప్టెంబర్​ అనేక గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్​ లో స్థానాలు మారుతున్న గ్రహాలు

సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
 సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
 సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
 సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
 సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

తులా రాశి వారికి సెప్టెంబర్‌లో కొత్త అవకాశాలు తలుపుతట్టే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలు .. పనులు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునే అవకాశాలు రావడంతో పాటు అనుకోని ఆర్థిక లాభాలు కూడా కలిసిరావచ్చని చెబుతున్నారు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. 

తుల రాశివారికి సెప్టెంబర్​ నెల మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు.

రాశ్యధిపతి శుక్రుడి స్వస్థాన ప్రవేశం, దశమస్థానంలో గురువు, లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశి ఉద్యోగులకు ఆదరణ, ప్రోత్సాహం వృద్ధి చెందు తాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణ యాలు, ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. 

ఉద్యోగంలో మార్పులకు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం అనుకూలి స్తుంది. జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

పరిహారం:  నిత్యం విష్ణు సహస్రనామ స్త్రోత్రం.. శుక్రవారం  లక్ష్మీ అష్టకం పఠించండి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.