నయనతార భర్త విగ్నేష్ శివన్కు ఎల్ఐసి నోటీసులు

నయనతార భర్త విగ్నేష్ శివన్కు ఎల్ఐసి నోటీసులు

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కుటుంబాన్ని వివాదాలు వదలడం లేదు. ఇటీవలే ఆమె నటించిన అన్నపూరణి(Annapoorani) సినిమాపై వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టులో పీల్ దాఖలవడంతో.. ఈ సినిమాపై నిషేధం విధించింది కోర్టు. ఇక తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు నయనతార భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan). 

ఆయన దర్శకుడిగా ఇటీవల ఎల్ఐసి(లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) సినిమాను మొదలుపెట్టారు. లవ్ టుడే మూవీ ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. నయనతార కీ రోల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shety), ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య(Sj Surya) నటిస్తున్న ఈ సినిమాను సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు ఎల్‌ఐసీ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) అనే టైటిల్‌ను పెట్టడంపై ఎల్‌ఐసీ సంస్థ అభ్యంతరం తెలిపింది.ఎల్‌ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) అనేది భారత్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన బీమా సంస్థ. అది తమ పేటెంట్‌ హక్కు.. అంటూ మూవీ మేకర్స్ కు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. అయితే ఈ విషయంపై ఎల్ఐసి మూవీ మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.