Nayanthara : నయన్..విగ్నేష్కు..షాకిచ్చిన నిర్మాతలు

Nayanthara : నయన్..విగ్నేష్కు..షాకిచ్చిన నిర్మాతలు

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).. తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు అండ్ దర్శకుడు. కోమలి(Komali) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్..ఆతరువాత హీరోగా లవ్ టుడే(Love Today) సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్కు క్రేజ్ బాగాపెరిగింది. అందుకే ఆయన చేస్తున్న సినిమాలపై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

ప్రస్తుతం ప్రదీప్ రంగ‌నాధ్ హీరోగా 'ఎల్ ఐ సీ'(LIC) )Love Insurance Corporation) అనే మూవీలో నటిస్తున్నాడు. నయనతార(Nayanthara) భర్త విగ్నేష్ శివన్(Vigneshshivan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే..ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కు అక్కగా నయనతార నటించేలా విగ్నేష్ శివ‌న్ ఒప్పించాడట.

ఇక భ‌ర్త రిక్వెస్ట్ చేయడంతో..నయన్ తన ఇమేజ్ ని పక్క‌న‌బెట్టి ఒప్పుకుంది. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ కి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. కానీ, ఇప్పుడే అసలైన చిక్కొచ్చి పడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఆరంభంలోనే..అడ్డంకులు మొదలయ్యాయి. అది కూడా నయనతార ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడమే ప్రధాన కారణం. 

అసలు విషయానికి వస్తే..ఎల్ ఐ సీ మూవీ బడ్జెట్..న‌య‌నతార‌కి ఇచ్చే రెమ్యునరేషన్ కు అసలు బ్యాలెన్స్ అవ్వ‌డం లేదట‌. ప్రస్తుతం నయన్ ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కానీ, ఇక్కడ సినిమా బడ్జెట్ మొత్తం బడ్జెట్ కేవలం రూ.5 కోట్లు మాత్రమే. అందువల్ల ఈ మూవీని నిర్మిస్తున్నసెవెన్ స్క్రీన్ సంస్థ ప్రొడ్యూసర్స్..నయనతార రేంజ్ హీరోయిన్ ఎందుకని ఆలోచనలో ప‌డ్డారట‌. అయితే..ఎల్ ఐ సీ మూవీలో నటించడానికి నయనతార ఐదు కోట్లు మాత్రమే తీసుకోవడానికి ఒప్పుకుందట‌. కానీ ఇప్పుడా పారితోషికం కూడా ప్రొడ్యూసర్స్ ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని సమాచారం.

ఈ విషయంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రొడ్యూసర్స్ తీరుపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా నయన్..విగ్నేష్ శివన్ కు ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.  మరి ఏమవుతుందో చూడాలి. ఇక నాందా రౌడీ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించనున్నారు.