Akkineni Akhil: సలార్ 2 లో అక్కినేని అఖిల్..ప్రశాంత్ నీల్ వైఫ్ క్లారిటీ

Akkineni Akhil: సలార్ 2 లో అక్కినేని అఖిల్..ప్రశాంత్ నీల్ వైఫ్ క్లారిటీ

ప్రభాస్ (Prabhas) సలార్ (Salaar) తో వచ్చి బాక్సాపీస్ లెక్కలను మరోసారి టచ్ చేశాడు. ఇక సలార్ రెండో భాగమైన శౌర్యంగ పర్వం (Shouryanga Parvam) పై ఇప్పటినుండే భారీ అంచనాలు ఫ్యాన్స్లో క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే..సలార్ ఫస్ట్ పార్ట్ లో ప్రశ్నలుగా మిగిలిన అన్నిటికీ..వాటికి రెండో పార్టు శౌర్యంగ పర్వంలో క్లారిటీ ఇవ్వనున్నారు ప్రశాంత్. రీసెంట్గా సలార్ మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్లో అక్కినేని అఖిల్ ఉండటంతో..సలార్ పార్ట్ 2లో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. అంతేకాదు..రాబోయే పార్ట్ 2లో దేవా తమ్ముడుగా అఖిల్ కనిపిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

లేటెస్ట్గా అఖిల్(Akhil) పై వస్తోన్న వార్తల్లో క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత రెడ్డి తన ఇంస్టాగ్రామ్లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈక్రమంలో సలార్ సక్సెస్ ఈవెంట్కి అఖిల్ ఎందుకు వచ్చారు..సలార్ 2లో నటిస్తున్నాడా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై లిఖిత రెడ్డి క్లారిటీ ఇచ్చేసింది.  

ప్రభాస్ సలార్ 2 లో అఖిల్ నటిస్తున్నట్లు వస్తోన్నవార్తల్లో ఎటువంటి నిజం లేదని..ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని కన్ఫర్మ్ చేసింది. అయితే హోంబలే ఫిలింస్ బ్యానర్ లో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని..అందుకే సలార్ సెలబ్రేషన్స్ కు ప్రొడ్యూసర్స్ పిలవడంతోనే వచ్చాడని తెలిపింది. దీంతో అఖిల్ పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.

ఏదేమైనప్పటికీ సలార్ పార్ట్ 2 లో అఖిల్ కనిపిస్తే..ఫ్యాన్స్ ఖుషి అయ్యేవాళ్లు. ప్రస్తుతం సలార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ..రికార్డ్ లెవల్లో వ్యూస్ సాధిస్తూ దుమ్ములేపుతోంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Likitha (@likithareddyneel)