
త్రిగుణ్ హీరోగా వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘లైన్ మ్యాన్’. పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్లో రెండు కరెంట్ స్తంభాల మధ్య లైన్ మ్యాన్ గెటప్‌లో కనిపిస్తున్నాడు త్రిగుణ్. డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మాండ్య ప్రాంతంలోని గ్రామీణ పరిస్థితులను చూపిస్తూ.. లైన్ మ్యాన్ కష్టాలతో కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలియజేశారు. మార్చి 15న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంతో త్రిగుణ్ కన్నడ ఎంట్రీ ఇస్తున్నాడు. కాజల్ కుందెర్, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ ఇతర పాత్రలు పోషించారు. కాద్రి మణికాంత్ సంగీతం అందిస్తున్నాడు.