రామప్ప పరిసరాల్లో మద్యం నిషేధం

రామప్ప పరిసరాల్లో మద్యం నిషేధం

వెంకటాపూర్( రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ సందర్శించే పర్యటకులు, భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని వెంకటాపూర్​ ఎస్సై చల్ల రాజు హెచ్చరించారు. ఆదివారం ఆలయ పరిసరాల్లో మద్యం నిషేధం, రామప్ప సరస్సులో ఈతకు వెళ్లి మృత్యువాత పడకూడదని పేర్కొంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ పరిసరాలను అపవిత్రం చేయకూడదని, ప్రతిరోజు పోలీసులు రామప్పలో గస్తీ నిర్వహిస్తారని, భక్తులకు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరారు.