మందు తాగి కారుతో బీభత్సం ..భార్యాభర్తలకు గాయాలు

మందు తాగి కారుతో బీభత్సం ..భార్యాభర్తలకు గాయాలు

మేడిపల్లి  : మద్యం మత్తులో ఓవర్​స్పీడ్ తో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి కథనం ప్రకారం.. గురువారం ఉదయం పీర్జాదిగూడ వరంగల్ హైవేపై పిల్లర్ నంబర్ 57 సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఓవర్​స్పీడ్​తో వచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది.

 దీంతో ముందు వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. తర్వాత వెనక వస్తున్న కారు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ముందు వెళ్తున్న కారులోని సాయిశివ (30), ఆయన భార్య మేఘన (28) గాయపడ్డారు. ఢీకొట్టిన కారు నడిపిన ఆకున్ సబర్వాల్ (19) మందు తాగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. 

రీడింగ్​చెక్​చేయగా, 238 వచ్చిందని తెలిపారు.  అతడికి లైసెన్స్ లేదని, కారు నంబర్ ప్లేట్ కూడా నకిలీదిగా గుర్తించారు. దీంతో సబర్వాల్​తో పాటు కారు ఇచ్చిన యజమాని మంగీలాల్​పై కేసు నమోదు చేశారు.