ఇంటెన్స్ మూవీస్తో.. నవంబర్ ఫస్ట్ వీక్ .. అవేంటో చూసేయండి

 ఇంటెన్స్ మూవీస్తో.. నవంబర్ ఫస్ట్ వీక్ .. అవేంటో చూసేయండి

సినిమాల జాతర ప్రతి శుక్రవారం ఉంటూనే ఉంటుంది. ఇక దసరా, సంక్రాంతి, క్రిస్మస్ వంటి బడా ఫెస్టివల్స్ వస్తే.. ఆడియన్స్లో మరింత ఉత్సాహం కూడా ఉంటుంది. ఇక రీసెంట్గా దసరా కానుకగా రిలీజైన బడా హీరోల మూవీస్తో బాక్సాపీస్ లెక్కలు ఇప్పటికీ వినబడుతూనే ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలలో వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీస్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి.

దీంతో మరో కొత్త మూవీస్ కోసం సినీ ప్రియులు వెయిట్ చేస్తుండటంతో..నవంబర్ వంతు వచ్చినట్టుంది. ఈ నవంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసుకోవాలని ఆడియన్స్ భలే ఉత్సాహం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో చూసుకుంటే..అదిరిపోయే ఇంటెన్స్ మూవీస్ ఉన్నాయనే చెప్పుకోవాలి. 

కీడా కోలా :

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. లేటెస్ట్ ఆయన రైటర్, డైరెక్టర్, యాక్టర్ గా చేసిన మూవీ కీడా కోలా(Keedaa Cola).

30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు(Chaitanya Rao), రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ మూవీ..సిడార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

మా ఊరి పొలిమేర 2 :

మా ఊరి పొలిమేర(Maa oori Polimera)..అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇది. సత్యం రాజేష్(Sathyam rajesh), బాలాదిత్య(Baladithya), గెటప్ శ్రీను(Getup srinu) ప్రధాన పాత్రలో అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులకైతే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

ఈ సినిమా సీక్వెల్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కి..థ్రిల్ ఇచ్చే న్యూస్ ఇదే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆడియన్స్ అంతలా ఎదురు చూసిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.

నరకాసుర

పలాస మూవీతో మంచి హిట్ అందుకుని..తెలుగు ఆడియాన్స్ కు చేరువైన హీరో రక్షిత్ అట్లూరి లేటెస్ట్ మూవీ నరకాసుర (Narakasura). పలాస తరహాలోనే రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా..ఈ మూవీపై ఆడియన్స్ కు అంచనాలున్నాయి. ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature