బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అద్వానీని శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అద్వానీకి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.98 ఏళ్ల బీజేపీ నేత వయసు రీత్యా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది మే నెలలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
