- తేల్చిన అటవీ శాఖ అధికారులు
మియాపూర్, వెలుగు: మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక వైపు శుక్రవారం రాత్రి చిరుతపులి కనిపించిందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది చిరుత కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు తేల్చారు. శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక వైపు మట్టికట్టపై చిరుతపులి కనిపించిందనే వార్తలు, వీడియోల ను మియాపూర్ పోలీసులు అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
శంషాబాద్, మేడ్చల్ ఫారెస్ట్ డీవోలు విజయానందరావు, జానకిరాం పోలీసులతో కలిసి అక్కడికి చేరుకొ ని పాదముద్రలు పరిశీలించారు. చిరుత పాదముద్ర లు 8 ఇంచులు ఉంటాయని.. అక్కడున్న ముద్రలు 4 ఇంచుల లోపే ఉన్నాయని, దీంతో అది చిరుత కాదని తేల్చారు.