నేరడిగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో బాత్ రూమ్ లు ఉన్నా.. ఉపయోగం సున్నా

 నేరడిగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో బాత్ రూమ్ లు ఉన్నా.. ఉపయోగం సున్నా

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులకు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆఫీసుల ఆవరణలో బాత్​రూమ్​లను నిర్మించినప్పటికీ వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు.

మండలంలోని మారుమూల గ్రామాల నుంచి ధ్రువీకరణ పత్రాలు, భూ సమస్యలు, ఇతర పనుల కోసం రైతులు, మహిళలు నిత్యం ఆఫీసులకు వస్తుంటారు. కానీ ఆఫీసుల్లో బాత్​రూమ్​లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి నిరుపయోగంగా ఉన్న బాత్ రూమ్ లను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.