కోలీవుడ్‌లో తనదైన స్టైల్‌తో సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించి సంచలనం సృష్టించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్.. లేటెస్ట్ గా హీరోయిజంతోనూ ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'డిసి' ( DC ). విలక్షణమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం అంచనాలకు మించి సర్‌ప్రైజ్ ఇచ్చింది.
లోకేష్ కనగరాజ్‌ను తొలిసారి హీరోగా తెరపై చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాకు భారీగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా పవర్‌ఫుల్ హీరోలను డిజైన్ చేసిన లోకేష్.. ఈసారి స్వయంగా హీరోగా మారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోవడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన 'DC' బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి 'DC' స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకుంది. ఈ మేరకు సన్ నెక్ట్స్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది.
The Mega Blockbuster of the year, #DC is all set to stream only on #SunNXT from September 4th in Tamil, Telugu & Malayalam
— SUN NXT (@sunnxt) August 29, 2026
Experience the madness in Dolby Vision and Dolby Atmos! @Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP… pic.twitter.com/huxpEViqbr
అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఇదే సమయంలో సినిమా ప్రీమియర్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే రెండు ప్లాట్‌ఫామ్‌లపై ఒకేసారి స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'DC'లో వామికా గబ్బి కథానాయికగా నటించగా.. సంజనా కృష్ణమూర్తి కీలక పాత్రలో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా నిలిచింది. ఇక థియేటర్లలో మిస్ అయిన లోకేష్ అభిమానులకు.. సెప్టెంబర్ 4 నుంచి 'డిసి' ఓటీటీలో దుమ్మురేపేందుకు రెడీ అవుతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది..
