లోకేష్ ఫైట్ క్లబ్‌‌‌‌‌‌‌‌

లోకేష్ ఫైట్ క్లబ్‌‌‌‌‌‌‌‌

ఖైదీ, విక్రమ్, లియో లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ఇటీవల నిర్మాతగానూ మారాడు. ‘జి స్క్వాడ్’ పేరుతో సొంత‌‌‌‌‌‌‌‌ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ నుంచి  మొదటి చిత్రంగా ‘ఫైట్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌’ వస్తోంది. ‘ఊరియాడి’ ఫేమ్ విజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ హీరోగా నటిస్తుండగా, అబ్బాస్‌‌‌‌‌‌‌‌ ఏ రహ్మత్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం విడుదల చేశారు.

టైటిల్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టే అల్లరి చిల్లరగా తిరిగే యూత్, వాళ్ల మధ్య గొడవలు, చేజ్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌తో ఈ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్ చేశారు. గోవింద్‌‌‌‌‌‌‌‌ వసంత అందించిన సంగీతం ఆకట్టుకుంది. అన్‌‌‌‌‌‌‌‌ ఫిల్టర్డ్‌‌‌‌‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన రా అండ్ రస్టిక్‌‌‌‌‌‌‌‌ సినిమా ఇదని చెబుతున్నారు మేకర్స్. డిసెంబర్ 15న సినిమా విడుదల కానుంది. మరోవైపు త్వరలోనే రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న 171వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు.