Logtour: లాంగ్‌‌ టూర్లకు వెళ్లేటోళ్లకు ఈ టోన్ డ్రమ్‌‌ ఎంత ఉపయోగమో తెలుసా..!

Logtour: లాంగ్‌‌ టూర్లకు వెళ్లేటోళ్లకు ఈ టోన్ డ్రమ్‌‌ ఎంత ఉపయోగమో తెలుసా..!

లాంగ్‌‌ టూర్లకు వెళ్లినప్పుడు కాలక్షేపం కోసం, సంగీతం నేర్చుకుంటున్న పిల్లలకు ఈ డ్రమ్‌‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎఫ్‌‌వైఏ అనే కంపెనీ మార్కెట్‌‌లో అమ్ముతోంది. ఈ డ్రమ్‌‌ని కార్బన్ మిశ్రమంతో పూర్తిగా చేతితో తయారుచేస్తారు. 

పది అంగుళాల డ్రమ్‌‌పై 11 స్వరాలు, 14 అంగుళాల డ్రమ్‌‌పై 15 స్వరాలు(నోట్స్‌‌) మోగుతాయి. పై భాగంలో మ్యాట్ టెక్స్చర్ ఉంటుంది. రంగు మారకుండా, అరిగిపోకుండా ఉండేందుకు స్ప్రే పెయింట్‌‌తో పూత పూస్తారు. దీన్ని వాయించడానికి డ్రమ్ స్టిక్స్ కూడా వస్తాయి.దీని ధర సైజు, స్వరాల సంఖ్యను బట్టి రూ. 2,499 నుంచి 7,499 వరకు ఉంటుంది.