మిషన్ సి 1000 సినిమా నుంచి శ్రీరాముడి పాట విడుదల

మిషన్ సి 1000 సినిమా నుంచి శ్రీరాముడి పాట విడుదల

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ‘మిషన్ సి 1000’ సినిమా నుంచి శ్రీరాముడి పాటను విడుదల చేశారు. శ్రీధర్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ పాడారు. రాముడి గొప్పతనాన్ని తెలియజేస్తూ జేవీపీ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

తేజేశ్వర్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో సినిమా రిలీజ్‌‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  ప్రజ్ణ నయన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  జయప్రకాష్, కబీర్ సింగ్, సంజయ్ పాండే, అనీష్ కురువిల్లా, కాళీ చరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.