లవ్ @ 65 మూవీ ట్రైలర్‌‌‌‌ రిలీజ్

లవ్ @ 65 మూవీ ట్రైలర్‌‌‌‌ రిలీజ్

సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్‌‌లో దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ @ 65’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదుదాక ఉంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయారంటూ ట్రైలర్ ద్వారా  రాజేంద్ర ప్రసాద్, జయప్రద పాత్రలను పరి చయం చేశారు.

వీరిద్దరూ ప్రేమించుకుని, జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణ యించుకుంటారు. వీరిమధ్య వచ్చే సీన్స్ ఫన్నీగా ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా ఉన్నాయి. ‘అంద రూ నన్ను ఏడిపించిన వాళ్లే కానీ.. నా కోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ అంటూ జయప్రద చెప్పే డైలాగ్‌‌తో  ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌తో పాటు ఎమోషన్స్ కూడా సినిమాలో చూపించబో తున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్,  ప్రదీప్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.  సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.