నవ్వులు పంచే లవ్ ఓటీపీ

నవ్వులు పంచే లవ్ ఓటీపీ

అనీష్‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌‌‌‌‌‌‌‌ ఓటీపీ’. జాన్విక, స్వరూపిణి  హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌.  రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషించారు.  విజయ్‌‌‌‌‌‌‌‌ యం రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.  ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌ 
ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్ కారెక్టర్‌‌‌‌‌‌‌‌ పోషించాను.  

థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందరూ ఎంజాయ్ చేసేలా, హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు.  హీరో, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ  ‘తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించి హీరోగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. కంటెంట్‌‌‌‌‌‌‌‌ను నమ్మి ఈ సినిమా చేశాం.  

అదే మా ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌. రాజీవ్ కనకాల మా సినిమాకు ఎంతో సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోంది’ అని చెప్పాడు.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌, పాటల‌‌‌‌‌‌‌‌ తరహాలో సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని నిర్మాత విజయ్ ఎం రెడ్డి తెలియజేశారు. హీరోయిన్ జాన్విక,  కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబా భాస్కర్, నటుడు నాట్య రంగ,  డీవోపీ హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్,  లిరిక్ రైటర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.