లవ్‌‌ స్టోరి రెడీ

లవ్‌‌ స్టోరి రెడీ

శేఖర్‌‌‌‌ కమ్ముల సినిమాపై ఎప్పుడూ మంచి అంచనాలే ఉంటాయి. దానికి తోడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించడం.. సారంగదరియా పాట రికార్డులు సృష్టించడం వంటి వాటి వల్ల ‘లవ్‌‌స్టోరి’ చిత్రంపై అంచనాలు మరింత భారీగా ఏర్పడ్డాయి. అందుకే ఎప్పుడెప్పుడు మూవీ రిలీజవుతుందా అని సినీ లవర్స్ ఎదురు చూశారు. కానీ సెకెండ్‌‌ వేవ్ రిలీజ్‌‌కి అడ్డుపడింది. ఎట్టకేలకి ఇప్పుడు ముహూర్తం ఫిక్సయ్యింది. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని థియేటర్స్‌‌లో రిలీజ్ చేస్తున్నట్లు నిన్న అనౌన్స్ చేశారు. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు నిర్మించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. సీహెచ్ పవన్ సంగీతం అందించాడు.