పెద్దల కోసం.. ప్రేమికుల సూసైడ్ అటెంప్ట్

పెద్దల కోసం.. ప్రేమికుల సూసైడ్ అటెంప్ట్

జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికులలో కలకలం రేపింది. వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద ప్రేమికులిద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన 25 ఏళ్ల చిప్పకుర్తి సంతోష్, 23 సంవత్సరాల న్యాతరి శిరీషగా గుర్తించారు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారో, లేదోనన్న ఆందోళనతో పాటు... తమ వల్ల పెద్దలకు ఎలాంటి ఇబ్బంది రావొద్దనే ఉద్ధేశ్యంతో ఈ ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.