తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు

తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు

ఈ రోజుల్లో బైకు లేని ఇల్లు లేదు..ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైకులు ఉంటున్నాయి. ప్రస్తుత బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి బైక్ తప్పనిసరి.. అయితే మార్కెట్లో అనేక రకాల బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అత్యంత సరసమైన ధర, మంచి మైలేజ్ అందించే బైకుల గురించి తెలుసుకుందాం. 

TVS Sports: తక్కువ ధరలో సామాన్యుడికి కూడా అందుబాటులో బైకుల్లో టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ ఒకటి. దీని ధర రూ. 66వేల 320 నుంచి 71వేల 023 వరకు ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ బైక్ 109.7 cc , సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 8.19 PS పవర్, 8.7 NM గరిష్ట టార్క్స్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త టీవీఎస్ స్పోర్ట్ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఈ బైక్ లీటర్ కు 70 km మైలేజ్ ని అందిస్తుంది. ఈ బైక్ పట్టణ ప్రాంతాల్లో వారికి కంఫర్ట్ గా ఉంటుంది. 

TVS Star City Plus: టీవీఎస్ Star City Plus బైక్ ధర మార్కెట్ లో రూ. 77వేల138 నుంచి రూ.80వేల 288 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో 109 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ 8.08 PS గరిష్ట పవర్, 8.7 Nm గరిష్టటార్క్ ను  ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ తో వస్తుంది.

టీవీఎస్ స్టార్ సిటీప్లస్ లీటర్ కు 83.09 కి.మీ గరిష్ఠ మైలేజ్ ను అందిస్తుంది. ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో అందుకోగలదు. LED హెడ్ లైట్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జిం గ్ సాకెట్ వంటిఫీచర్లు ఉన్నాయి. భద్రత ద్ర కోసం ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. బరువు 116 కిలోలు.

TVS Raider : టీవీఎస్ రైడర్ బైక్ ధర రూ. 98వేల 709 నుంచి రూ.1.08 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. 124.8 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో రన్ అవుతుంది.  గరిష్ఠం గా 11.38PS పవర్, 11.2 Nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్ బాక్సును కలిగి ఉంటుంది. లీటర్ కు 71.91 కి.మీలు మైలేజీని అందిస్తుంది. TVS రైడర్ ఎకో, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో LED హెడ్లైట్, హాలోజన్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్, LCD ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్లతో డజన్ల కొద్దీ ఫీచర్లతో ఈ బైక్ అందుబాటులో ఉంది.