CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో

CSK vs LSG  :  టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో

ఏకనా స్టేడియం వేదికగా  చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్‌ గెలిచిన  లక్నో కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా చెన్నై బ్యాటింగ్‌ చేయనుంది.   ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో 3 మ్యాచ్‌ల్లో గెలుపొంది ఐదో స్థానంలో ఉంది. 

లక్నో జట్టు: క్వాంటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), దీపక్‌ హుడా, మార్కస్‌ స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనీ, కృనాల్‌ పాండ్య, మ్యాట్‌ హెన్రీ, రవి బిష్ణోయ్‌, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌

చెన్నై జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌(కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, అజింక్య రహానె, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎం.ఎస్‌.ధోనీ, దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌, మతీషా పతిరణ