LSG vs GT : లక్నోకు స్పల్ప టార్గెట్.. క్రునాల్ పాండ్యా సూపర్ బౌలింగ్

LSG vs GT : లక్నోకు స్పల్ప టార్గెట్.. క్రునాల్ పాండ్యా సూపర్ బౌలింగ్

సొంత గడ్డపై జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు రెచ్చిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్ మెన్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్ 135 పరుగులు చేసింది.

గుజరాత్ బ్యాట్స్ మెన్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వ్రిద్దిమాన్ సాహా (47, 37 బంతుల్లో) కలిసి హార్దిక్ (66, 50 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ల పతనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. 

లక్నో బౌలర్లదాటికి గుజరాత్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. శుభ్ మన్ గిల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అభినవ్ ముకుంద్ (3, 5 బంతుల్లో), విజయ్ శంకర్ (10, 12 బంతుల్లో), మిల్లర్ (6, 12 బంతుల్లో), రాహుల్ తివాటియా (2, 2 బంతుల్లో) పరుగులు చేయడానికి కష్టపడ్డారు. దీంతో 135 పరుగులకు గుజరాత్ ను కట్టడి చేయగలిగింది. 

లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 కీలక వికెట్లు తీసి గుజరాత్ ను దెబ్బకొట్టాడు. స్టోయినిస్ కు రెండు వికెట్లు దక్కాయి. నవీన్ అల్ హక్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు.