లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ రివీల్

లక్కీ భాస్కర్ మూవీ ఫస్ట్  లుక్ పోస్టర్‌‌‌‌ రివీల్

మూడేళ్ల క్రితం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌‌కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. రీసెంట్‌‌గా ‘గుంటూరు  కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగులో బిజీగా ఉంది. మార్చి 5న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల నుంచి ఆయా మూవీ మేకర్స్ మంగళవారం బర్త్‌‌డే విషెస్ తెలియజేశారు. ‘లక్కీ భాస్కర్’ టీమ్ తన ఫస్ట్  లుక్ పోస్టర్‌‌‌‌తో పాటు క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు.  

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌‌కు జోడీగా మీనాక్షి కనిపించనుంది. ఇందులో ఆమె హౌస్ వైఫ్  సుమతి పాత్ర పోషిస్తోంది. చీర కట్టులో ఇంటి గుమ్మం ముందు కూర్చున్న మీనాక్షి  పోస్టర్ ఆకట్టుకుంటోంది.  సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ ‘మట్కా’,  విశ్వక్ సేన్ పదో చిత్రంతో పాటు తమిళ హీరో విజయ్‌‌కి జంటగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో ఆమె నటిస్తోంది.  ఆయా సినిమాల మేకర్స్ తనకు బర్త్‌‌డే విషెస్ తెలియజేశారు. మరికొన్ని క్రేజీ  ప్రాజెక్టులు కూడా మీనాక్షి లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది.