
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు.
ఇక శుక్రవారం (మే 17న)రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ ప్రోమోతోనే వెన్నులో వణుకు పుట్టించేశాడు అనిరుధ్.తాజాగా ఈ ఫియర్ సాంగ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రీ 9RamajogaiahSastry) ఆసక్తికర ట్వీట్ చేశారు.
"ఒక్క రోజు వెయిట్ చేయండి. మన అనిరుధ్… అబ్బా వర్తు వెయిటింగ్ అని అందరి నోటా అనిపిస్తాడు. రెండో పాట రికార్డింగ్ కోసం చెన్నై వచ్చా..ఇది ఇంకో రకం ప్రకంపనం. అది కోత అయితే ఇది లేత అంటూ..పరోక్షంగా సెకండ్ సాంగ్ ఎలా ఉండబోతోందనేది క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఫీవర్ సాంగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని చెప్పి ఆడియన్స్‌లో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాడు. అయితే ఈ ఫియర్ సాంగ్ ఎలా ఉండబోతుందో అనే విషయాన్నీ 14 సెకన్ల ఆడియో..వీడియోతో తెలిసిపోయింది.మరి సెకండ్ సాంగ్ లేత అంటూ హింట్ ఇవ్వడంతో ఎలా ఉండబోతుందో ఊహించండి.
ఒక్క రోజు ఓపిక పట్టండి ❤️
— RamajogaiahSastry (@ramjowrites) May 17, 2024
మన "అని"...అబ్బా...వర్తు వెయిటింగ్
"అని" పిస్తాడు...మనందరినోట..
రెండో పాట రికార్డింగ్ కి వచ్చా చెన్నై
ఇది ఇంకో రకం ప్రకంపనం...
అది కోత ఇది లేత ❤️#Devara
అయితే..ఈ మేరకు రెండో పాట హాట్ డాన్స్ నెంబర్‌గా ఉండబోతోందని శాస్త్రీ ట్వీట్ బట్టి అర్ధమవుతోంది.ఈ పాట తారక్,బ్యూటీ జాన్వీ కపూర్ ఇద్దరి మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ని సెకండ్ సింగిల్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా ఈ సాంగ్స్ క్లిక్ అయితే మాత్రం దేవర సాంగ్స్ సౌండ్ తో..ఇండియా ఆడియో జ్యూక్ బాక్స్ అన్నిటినీ బద్దలుకొట్టేలా ఉంది.మరి రేపు రిలీజ్ కాబోయే ఫియర్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.లేదంటే నిజంగానే ఫీవర్ వచ్చేద్ది.
ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రీ ట్వీట్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.ఇక రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.