భగవంతుడు మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్...

భగవంతుడు మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్...

తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా  జి.జి. విహారి దర్శకత్వంలో  రవి పనస నిర్మిస్తున్న చిత్రం ‘భగవంతుడు’.   పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా  ఈ చిత్రం నుంచి  ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్ చేశారు.   శ్రామిక శక్తికి నమస్కరిస్తూ సాగిన ఈ పాట ఆకట్టుకుంది.  కృష్ణ ప్రసాద్ కంపోజ్ చేయగా,   సింగర్ కుమార వాగ్దేవి  పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు.  

ఈ పాట గురించి  మేకర్స్ స్పందిస్తూ  ‘మన మట్టిలో ప్రతి పని ఒక  దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు పోలేరమ్మను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు గంగమ్మను, కష్ట, సుఖాల్లో ఎల్లమ్మను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. వాళ్లంతా శ్రామికులకు తోడుండే ధైర్య రూపాలు. 

అలాంటి మన అమ్మవార్లకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ "శరణమన్న శరణం" పాట.   మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకు మే డే సందర్భంగా మా వందనం” అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.