OTTలో పొలిమేర-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTTలో పొలిమేర-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మా ఊరి పొలిమేర(Maa Oori Polimera).. అస్సలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది ఈ మూవీ. చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. కొత్త దర్శకుడు అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డైరెక్ట్ ఓటీటీలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ  సినిమా సీక్వెల్ మా ఊరి పొలిమేర2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నవంబర్ 3న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా కూడా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సీక్వెల్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టింది ఈ మూవీ. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్ల భారీ మొత్తాన్ని రాబట్టింది. కేవలం రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సీక్వెల్ చివర్లో పార్టీ 3 కూడా ఉండనుందని అనౌన్స్ చేసి మరి షాకిచ్చారు మేకర్స్. 

ఇక మా ఊరి పొలిమేర2 రిలీజై నెల రోజుల గడుస్తుండటంతో ఓటీటీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ డిసెంబర్ 8నుండి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.