బబుల్ గమ్‌‌‌‌..  బోల్డ్ కాదు బ్యూటీఫుల్ : మానస చౌదరి

బబుల్ గమ్‌‌‌‌..  బోల్డ్ కాదు బ్యూటీఫుల్ : మానస చౌదరి

‘బబుల్ గమ్‌‌‌‌’ చిత్రంతో హీరోయిన్‌‌‌‌గా టాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇస్తోంది మానస చౌదరి. రోషన్ కనకాల హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ ‘నేను పుట్టింది చిత్తూరు జిల్లా పుత్తూరులో అయినా పెరిగిందంతా చెన్నైలో. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి వచ్చా. ‘ఎమోజీ’ అనే తమిళ వెబ్ సిరీస్‌‌‌‌ తర్వాత ఇందులో అవకాశం వచ్చింది. లవ్, రెస్పెక్ట్‌‌‌‌ గురించిన కథ ఇది. చాలా రియలిస్టిక్‌‌‌‌గా అనిపించింది.

జాన్వి అనే ఫ్యాషన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా. ఆ పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకొని చేశాను. అలాగే మోడలింగ్ నుంచి వచ్చాను కనుక కెమెరా ఫియర్ లేదు. దర్శకుడి విజన్‌‌‌‌కు న్యాయం చేస్తున్నానా లేదా అనే దానిపైనే ఫోకస్ పెట్టాను. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ దక్కడం ఆనందంగా ఉంది. ఇంటిమేట్ సీన్స్‌‌‌‌లో నటించడం మాత్రం కొంత సవాల్‌‌‌‌గా అనిపించింది. ఆ సీన్స్‌‌‌‌ను బోల్డ్‌‌‌‌ అనడం కంటే చాలా బ్యూటీఫుల్‌‌‌‌గా ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు.

జాన్వీ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇక సెట్‌‌‌‌లో రవికాంత్ అండ్ టీమ్ చాలా సరదాగా ఉంటారు. రోషన్‌‌‌‌కు నటనపై మంచి పట్టుంది. ఈ సినిమాతో తను నేర్చుకోవడంతో పాటు నాకూ చాలా విషయాలు నేర్పించాడు. దాదాపు ఏడాది పాటు సాగిన మెమరబుల్ జర్నీ ఇది’ అని చెప్పింది.