Maaremma: రవితేజ తమ్ముడు కొడుకు సినిమా.. తెలంగాణ నేటివిటీ ‘మారి’ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్

Maaremma: రవితేజ తమ్ముడు కొడుకు సినిమా.. తెలంగాణ నేటివిటీ  ‘మారి’ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్‌‌‌‌. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం ‘మారి’ సెకండ్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేసిన పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించగా, మంగ్లీ పాడిన తీరు ఆకట్టుకుంది. సాంగ్‌‌‌‌ లాంచ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో హీరో మాధవ్ మాట్లాడుతూ ‘ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. నెలాఖరులో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు. ఇందులో నటించడం వెరీ స్పెషల్ అని దీపా బాలు చెప్పింది. కొత్త తరహా స్ర్కీన్‌‌‌‌ప్లేతో ఆకట్టుకుంటుందని  దర్శకుడు మంచాల నాగరాజు అన్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MB (@maadhav._.bhupathiraju)

నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ ‘తెలంగాణ నేటివిటీ, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఈ చిత్రం  తెరకెక్కింది.  నాగరాజు చెప్పిన కథలో మా ఊరి నేపథ్యం, ప్రతి పాత్ర మా ఊర్లోని ఒక్కొక్కరిని గుర్తు చేసింది.  ఒక నిజమైన తెలంగాణ పల్లెటూరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని ఇందులో చూస్తారు’ అని అన్నారు. చైల్డ్ ఆర్టిస్టులు తమోజ్ఞ, సర్కార్, ఎడిటర్ సాయిబాబు, సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి పాల్గొన్నారు.