థియేటర్లలో నవ్వుల హంగామా

థియేటర్లలో నవ్వుల హంగామా

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌‌ కుమార్, గోపికా ఉద్యాన్  లీడ్ రోల్స్‌‌లో నటించిన కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మ్యాడ్‌‌’. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన  ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, దర్శకులు వెంకీ అట్లూరి, అనుదీప్  అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేస్తూ టీమ్‌‌ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రేక్షకులు పెట్టిన ప్రతి రూపాయికి తగ్గ వినోదాన్ని తాము అందిస్తాం అన్నారు నటీనటులు. థియేటర్లలో నవ్వుల హంగామా గ్యారెంటీ అని చెప్పాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.