సొంతూరిలో.. పొలంలో ట్రాక్టర్ నడిపిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం

సొంతూరిలో.. పొలంలో ట్రాక్టర్ నడిపిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డిసెంబర్ 14న తన గ్రామానికి వెళ్లి తన వ్యవసాయ మూలాలను ఆలింగనం చేసుకున్నారు. పొలంలో ట్రాక్టర్ నడుపుతూ తన విలక్షణమైన శైలిని ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఆయన Xలో ఒక పోస్ట్‌ ద్వారా పంచుకున్నారు. అక్కడ తాను పొలం దున్నానని, విత్తానాలు విత్తానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శివరాజ్ సింగ్ చౌహాన్.. తాను ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోతో పాట.. మన మధ్యప్రదేశ్ నేల బంగారం వంటిదని.. భూమి తల్లి సంపద, ధాన్యాలతో గృహాలను సంపన్నం చేస్తోందని చెప్పారు. చెమట చుక్కలతో మట్టికి నమస్కరించానని.. ఈరోజు పొలాలు దున్నానని, శనగలు విత్తానని తెలిపారు. ఈ క్రమంలోనే విదిషా జిల్లాలోని తన గ్రామానికి చేరుకుని... అక్కడ ఆయన తోటి రైతులతో చర్చలు జరిపాడు.