కారులో డ్రైవర్కు ఎదురుగా ఉండే మిర్రర్‌‌‌‌లో.. వెనక నుంచి వచ్చే వెహికల్స్ని చూస్తుంటారు.. కానీ ఈ మిర్రర్ పెట్టుకుంటే..

కారులో డ్రైవర్కు ఎదురుగా ఉండే మిర్రర్‌‌‌‌లో.. వెనక నుంచి వచ్చే వెహికల్స్ని చూస్తుంటారు.. కానీ ఈ మిర్రర్ పెట్టుకుంటే..

సాధారణంగా కారులో డ్రైవర్కు ఎదురుగా ఉండే మిర్రర్‌‌‌‌లో వెనక నుంచి వచ్చే వెహికల్స్ని చూస్తుంటారు. కానీ.. దాని ప్లేస్లో ఇలాంటి మిర్రర్‌‌‌‌ని పెట్టుకుంటే కారులోనే మేకప్ కూడా చేసుకోవచ్చు. దీన్ని వీ లోగో అనే కంపెనీ తీసుకొచ్చింది.  ఇందులో గ్లేర్ ఫ్రీ ఎల్​ఈడీ లైట్ బార్లు ఉంటాయి. వాటిలో 64 తెల్లని లైట్లు, 16 పసుపు రంగు లైట్లు ఉంటాయి. ఇవి మామూలు బల్బుల కంటే 50 శాతం ఎక్కువ బ్రైట్గా వెలుగుతాయి. 60 శాతం తక్కువ పవర్​ని వాడుకుంటాయి. డిమ్మింగ్, లైట్​ రంగులను మార్చేందుకు రెండు సెన్సర్ స్విచ్‌‌లు ఉంటాయి. ఈ మిర్రర్‌‌‌‌లో టచ్ కంట్రోల్ కూడా ఉంది. దాంతో లైట్లను ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వ్యానిటీ మిర్రర్‌‌‌‌లో ఇన్‌‌బిల్ట్‌‌గా 2000mAh లిథియం బ్యాటరీ ఉంటుంది. యూఎస్​బీ కేబుల్‌‌తో చార్జ్‌‌ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్​ చార్జ్‌‌ చేస్తే 8 గంటలు పనిచేస్తుంది.