ఇంటరెస్టింగ్ సీన్స్తో కట్టిపడేసిన మహాన్

ఇంటరెస్టింగ్ సీన్స్తో కట్టిపడేసిన మహాన్

లిక్కర్‌‌‌‌‌‌‌‌కి వ్యతిరేకంగా పోరాడే ఓ తండ్రి.. తన కొడుకుని గాంధీ మహాత్ముడిలా చూడాలనుకున్నాడు. అందుకే గాంధీ ‘మహాన్’ అని పేరు పెట్టాడు. అంతేకాదు.. పెద్దయ్యాక లిక్కర్‌‌‌‌‌‌‌‌కి వ్యతిరేకంగా పోరాడాలని కొడుకు దగ్గర మాట కూడా తీసుకున్నాడు. కానీ పెద్దయ్యాక తన బిడ్డ ఏకంగా బార్‌‌‌‌‌‌‌‌ సిండికేట్‌‌‌‌నే నడిపిస్తాడని ఆయన ఊహించలేదు. అతనలా మారడానికి కారణం ఏమిటి, తండ్రికిచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే ‘మహాన్‌‌‌‌’ మూవీ చూడాల్సిందే. నిన్న రిలీజ్‌‌‌‌ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఇంటరెస్టింగ్ సీన్స్‌‌‌‌తో కట్టి పడేసింది. మనీ, మందు కోసం జరిగే గొడవల చుట్టూ ఈ టీజర్‌‌‌‌‌‌‌‌ను కట్ చేశారు.

మహాన్‌‌‌‌గా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో విక్రమ్ కనిపిస్తున్నాడు. అతని కొడుకు ధృవ్‌‌‌‌ కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటించాడు. టీజర్‌‌‌‌‌‌‌‌ చివర్లో సైడ్‌‌‌‌ యాంగిల్‌‌‌‌లో ధృవ్‌ని చూపించారు. వీరిద్దరి క్యారెక్టర్స్ మధ్య లింక్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కార్తీక్‌‌‌‌ సుబ్బరాజ్ డైరెక్షన్‌‌‌‌లో లలిత్‌‌‌‌ కుమార్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 10న అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ ద్వారా విడుదలవుతోంది. తమిళంతో పాటు తెలుగు,  మలయాళ, హిందీ భాషల్లోనూ ఇదే టైటిల్‌‌‌‌. కన్నడలో మాత్రం ‘మహాపురుష’ అనే టైటిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు.