MAHAKALI Glimpse: మహాకాళి’ గ్లింప్స్‌ మైండ్‌బ్లోయింగ్.. అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి విశ్వరూపం..

MAHAKALI Glimpse: మహాకాళి’ గ్లింప్స్‌ మైండ్‌బ్లోయింగ్.. అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి విశ్వరూపం..

హనుమాన్ డైరెక్టర్’ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ ఎపిక్ ‘మహాకాళి’. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యాస్ వార్ క్రై’ పేరుతో విడుదలైన గ్లింప్స్ భారీ అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నాను శుక్రాచార్యుడిగా చూపించిన తీరు గ్లింప్స్‌కు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 

‘మహాకాళి’ స్టోరీ బ్యాక్ డ్రాప్..

భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. వివక్ష, ఆత్మవిశ్వాసం, అంతర్గత శక్తి, తన అసలైన గుర్తింపును తిరిగి పొందడం వంటి అంశాలను టచ్ చేయనుంది. ముఖ్యంగా ముదురు చర్మం కారణంగా ఎదురయ్యే వివక్షపై కూడా సినిమాలో చూపించనున్నారు ప్రశాంత్ వర్మ. మొత్తంగా చూస్తే.. ‘శుక్రాచార్యాస్ వార్ క్రై’ గ్లింప్స్ కథను పూర్తిగా చెప్పకుండా, ‘మహాకాళి’ ప్రపంచం ఎంత గ్రాండ్‌గా, డార్క్‌గా ఉండబోతోందో చూపిస్తూ అంచనాలను పెంచింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్ చివర్లో శ్రియా రెడ్డి.. అమ్మవారు పెద్దమ్మగా కనిపించిన అవతారం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. 

అక్షయ్ ఖన్నా పాత్ర ఎలా ఉండబోతుందంటే?

ఇందులో అక్షయ్ ఖన్నా పొడవాటి వెండి గడ్డం, కొప్పుతో కూడిన జుట్టు, చీకటిని చీల్చేలా కనిపించే తెల్లని కళ్లు, గంభీరమైన చూపులతో ఉన్న అక్షయ్ గంభీరంగా ఉంది. పురాణాల్లో అసురుల గురువుగా పేరుగాంచిన శుక్రాచార్యుడు.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. విశ్వజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, అసాధారణ జ్ఞానానికి ప్రతీకగా భావించే ఈ పాత్రను అక్షయ్ ఖన్నా పోషిస్తున్నారు.

గ్లింప్స్‌లో ముఖ్యంగా శుక్రాచార్యుడి పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీని పూర్తిగా రివీల్ చేయకుండా.. కేవలం చిన్న చిన్న విజువల్ ఎలిమెంట్స్‌తో క్యూరియాసిటీ పెంచేలా కట్ చేశారు. అక్షయ్ ఖన్నా అవతారం కూడా ఆయన గత పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

ఓవరాల్ గా భయానకత, మైథాలజీ, భారీ విజువల్స్, డార్క్ టోన్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇకపోతే, ‘మహాకాళి’ని 2027 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.