హైబ్రిడ్ లైవ్ యాక్షన్తో మహావీర్ కర్ణ

హైబ్రిడ్ లైవ్ యాక్షన్తో మహావీర్ కర్ణ

మహాభారతంలోని కర్ణుడి పాత్ర నేపథ్యంలో ఇప్పుటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ కూడా కర్ణుడి కథతో ‘మహావీర్‌‌‌‌‌‌‌‌ కర్ణ’ అనే సినిమా చేస్తున్నారు. ఇదొక హైబ్రిడ్ లైవ్ యాక్షన్ మూవీ.  శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. కురుక్షేత్ర యుద్ధం నేపథ్యంలో టీజర్‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది.

 పాండవుల పక్షాన నిలబడమంటూ కర్ణుడికి కృష్ణుడు ఇచ్చే ఉపదేశం, ఆ తర్వాత బ్రహ్మాస్త్రం,  కవచకుండలాలు లాంటి సన్నివేశాలను చూపించారు. ‘‘ఈ లోకం మరువనిది పోగొట్టుకున్న రాజ్యాలను, సంపదను కాదు.. ఇచ్చిన మాటను. ఈ కర్ణుడికి మాటే ప్రాణం” అంటూ కర్ణుడి వ్యక్తిత్వాన్ని చూపిస్తూ టీజర్‌‌‌‌‌‌‌‌ ముగించిన తీరు ఆకట్టుకుంది. 

జయంతీలాల్ గడా సమర్పణలో పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌‌‌‌వీ స్టూడియోస్‌‌‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. హైబ్రిడ్ క్రియేటర్ రామ్‌‌‌‌జీ దత్ డీఓపీగా, గీత రచయిత శ్రీమణి డైలాగ్ రైటర్‌‌‌‌గా, గ్యాని సంగీత దర్శకుడిగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 4న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా రిలీజ్ కానుంది.