మహేంద్రగిరి వారాహి ఆ జాబితాలో చేరుతుంది

మహేంద్రగిరి వారాహి ఆ జాబితాలో చేరుతుంది

సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన స్పిరిచ్యువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ‘వాట్ ఏ లాజిక్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సుమంత్ మాట్లాడుతూ ‘ఈ  సినిమాలో  కథ,  నా పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా, వేరే కోణంలో ఉంటాయి. ఇదొక  డివోషనల్ థ్రిల్లర్.  కాంతారా,  కార్తికేయ, విరూపాక్ష  లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో.. ఆ  జాబితాలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కూడా చేరుతుందని నమ్ముతున్నా’ అని అన్నాడు.

  ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని  డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి చెప్పాడు. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని  ప్రొడ్యూసర్ మధు అన్నారు. ఈ చిత్రంలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అన్నాడు.   మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11న విడుదల కానుంది.